Waltair veerayya : వాల్తేర్ వీరయ్యకు రేటింగ్.. యూఎస్ కలెక్షన్స్‌తో పోల్చుతూ చిరు సెటైర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య విజయవంతంగా దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన ఈ సినిమాకు నేటికీ ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 88 కోట్లకు షేర్, 142 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన వీరయ్య తన సత్తా ఏంటో తెలియజేస్తున్నాడు. ఈ సినిమా అమెరికాలోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటికే వీరయ్య యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.
2.5 అంటే 2.5 మిలియన్ డాలర్లన్న మాట :
ఈ సందర్భంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ అభిమానులతో చిరు వీడియో కాల్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వాల్తేర్ వీరయ్య సినిమాకు పలు వెబ్‌సైట్స్ ఇచ్చిన రేటింగ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి సెటైర్లు వేశారు. యూఎస్ ప్రీమియర్స్ చూసి ఇక్కడ కొందరు రివ్యూలు రాశి 2.5 రేటింగ్ ఇచ్చారని ఆయన అన్నారు. అయితే ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాల తరహాలో వీరయ్యలోనూ పూర్తి స్థాయి వినోదం వుందని తాము నమ్మామని చిరంజీవి అన్నారు. అందుకే రేటింగ్ పట్టించుకోవద్దని అనుకున్నానని మెగాస్టార్ తెలిపారు. అయితే తర్వాత తెలిసిందేంటంటే.. 2.5 అంటే 2.5 మిలియన్ డాలర్లని, అంటే వీరయ్య అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని వాళ్లు ముందే చెప్పారన్నమాట అంటూ చిరు సెటైర్లు వేశారు.
వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్లో చిరు సంచలన వ్యాఖ్యలు :
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం జరిగిన వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయొద్దని, సినిమాకు కావాల్సిన దానిని పేపర్ వర్క్‌లోనే పూర్తి చేయాలని సూచించారు. సినీ పరిశ్రమ బాగుండాలని డైరెక్టర్లు గుర్తించాలని చిరు అన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని మెగాస్టార్ పేర్కొన్నారు. సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కాదని.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్లో పిక్చర్ పూర్తి చేసి ఇవ్వడమని చిరు అన్నారు. కొన్ని షాట్స్‌ను ఎడిటింగ్ రూమ్‌లో పక్కన పడేశామనే మాటలు చిత్ర పరిశ్రమలో తరచుగా వింటూ వుంటామని పేర్కొన్నారు. కానీ వాల్తేర్ వీరయ్య ఏడు నుంచి పది నిమిషాలు మాత్రమే పక్కనపెట్టామని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout