కరోనా రోగుల కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున కరోనా బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్థితి విషమించిన వారి కోసం ప్లాస్మా అందించేందుకు సైతం కరోనా నుంచి కోలుకున్న వారు రాకపోవడం గమనార్హం. కొందరు మాత్రమే ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారు. ఎక్కువ సంఖ్యలో మాత్రం ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవరసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ నుంచి అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: కర్ఫ్యూతో ప్రయోజనం లేదు.. కఠిన లాక్‌డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్
కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చి ప్లాస్మా దానం చేయాలని పిలుపునిస్తున్నారు. అలాగే ప్లాస్మా గురించి వివరాలు, సరైన సూచనల కోసం తమ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీసుని సంప్రదించాలని ట్విటర్ వేదికగా చిరు కోరారు. సంప్రదించాల్సిన నంబర్లను సైతం తన ట్వీట్‌లో చిరు పేర్కొన్నారు. ‘‘సెకండ్ వేవ్‌లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతున్నారని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్లాస్మా కొరత వలన చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కొద్ది రోజుల ముందే రికవర్ అయినట్లైతే, మీ ప్లాస్మాని డొనేట్ చేయండి.
దీనివల్ల ఇంకో నలుగురు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లాస్మా డొనేషన్ గురించి వివరాలకు, సరైన సూచనలకు చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్‌ని సంప్రదించండి’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. సంప్రదించాల్సిన నంబర్లను సైతం చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 040-23554849, 9440055777 నబంర్లలో సంప్రదించాలని చిరు తెలిపారు.
As we know, Second wave of Covid is impacting even more people.If you have recovered from Covid in last few days,please donate your plasma so it can help 4 more people to combat Covid effectively.Please contact #ChiranjeeviCharitableFoundation (94400 55777)for details & guidance. pic.twitter.com/LXt2fFJYFs
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments