మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ద్వారక మోషన్ పోస్టర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న చిత్రం ద్వారక. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రవీంద్ర తెరకెక్కించారు. సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్‌పై ప్రద్యుమ్న, గణేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్ కలిసి 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ లో విడుదల చేశారు. తన అభిమాన నటుడైన చిరంజీవి సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం పట్ల హీరో విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేసారు. పెళ్ళిచూపులు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈనెల 16న ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖులు, అభిమానులు మధ్య గ్రాండ్ గా విడుదల చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్, కృష్ణభగవాన్, షకలక శంకర్, ఉత్తేజ్, నవీన్, గిరిధర్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్, ఫైట్స్: విజయ్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర(ఎం.ఎస్.ఆర్).
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments