పవర్ ఫుల్ పోస్టర్: కదలి వస్తున్న 'సిద్ధ'.. ఆచార్యలో రాంచరణ్ స్టన్నింగ్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఆచార్య. సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ సినిమాల్లో కథ బలంగా ఉంటుంది. అలాగే కమర్షియల్ అంశాలు ఉంటూనే ఆలోచింపజేసే సందేశం కూడా ఉంటుంది.

ఇలాంటి కథ దొరికితే మెగాస్టార్ రెచ్చిపోతాడని అందరికీ తెలుసు. అందుకే అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, లాహే లాహే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైపోయి ఉండాల్సింది. కానీ కరోనా మహమ్మారి మెగాస్టార్ ప్రభంజనానికి అడ్డుగా నిలిచింది.

మెగాస్టార్ రాకని తాత్కాలికంగా అడ్డుకుంది అంతే. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో దర్శకుడు కొరటాల శివ ఫైనల్ షెడ్యూల్ షురూ చేశారు. షూటింగ్ అప్డేట్ తెలియజేస్తూ చిత్ర యూనిట్ తాజాగా రాంచరణ్ లుక్ ని రిలీజ్ చేసింది. చరణ్ ఈ చిత్రంలో 'సిద్ధ'గా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో చరణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. చరణ్ వాకింగ్ స్టైల్ కూల్ గా ఉన్నపటికీ అతడి గెటప్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. మేడలో రుద్రాక్ష మాల, కండువాతో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది.

చరణ్ కి జోడిగా ఈ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ధర్మస్థలి ద్వారాలు తిరిగి తెరుచుకున్నాయి. ఫైనల్ షెడ్యూల్ లోకి ప్రవేశించాం. త్వరలో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వస్తాయి' అని చిత్ర యూనిట్ ప్రకటించింది. దేవాలయాల ఆస్తులు, భూముల చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

స్టాలిన్ తర్వాత మణిశర్మ చిరంజీవికి సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. ఫైనల్ షెడ్యూల్ పూర్తయ్యాక రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

More News

ఆగస్టులో 'ఏ1 మహేంద్ర క్రియేషన్స్' గోగుల నరేంద్ర నిర్మిస్తున్న 'సావిత్రి w/o సత్యమూర్తి'

అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు?

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్

తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు.

మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలు, బూతులతో.. పోలీసులకు ఫిర్యాదు

సీనియర్ నటుడు మోహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు.

ఒక వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ జరిగింది: అనుపమ పరమేశ్వరన్

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది.

పిడి గుద్దుల్లాంటి పంచ్ లు.. వరుణ్ తేజ్ భీకరమైన బాక్సింగ్ పోరాటం!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న హై యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'గని' చివరి షెడ్యూల్ కి చేరుకుంది.