జైపాల్‌రెడ్డి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. కాగా తాజాగా.. మాజీ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి.. జైపాల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ మేరకు చిరు ఓ ప్రకటన విడుదల చేశారు.
అభిమానపాత్రుడ్ని చేసింది!
"రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. అయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం నన్ను అయన పట్ల గౌరవాన్ని పెంచింది. అభిమానపాత్రుడ్ని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను. అలాగే జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను" అని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా.. జైపాల్ రెడ్డి అంత్యక్రియల అధికారిక లాంఛనాలతో సోమవారం నాడు జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout