మెగాస్టార్ చిరు ఇల్లు ఎలా ఉందో చూడండి!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ చేసుకున్నారు. దీంతో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తాము ఏమేం చేస్తున్నామనే విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. కాగా.. ఈ ఉగాదికి సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పటికే కరోనాపై పలు వీడియోలు, పలువురితో సంభావిషించిన చిరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియో చిరు ఇల్లు వ్యూ మొత్తం ఉంది. ఇల్లు పై భాగం మొదలుకుని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ మొత్తం ఈ 01:03 నిడివి గల వీడియోలో ఉంది. జూబ్లిహిల్స్‌లోని కొండపై అత్యంత విలాసవంతంగా ఉండే చిరంజీవి ఇంటిని అభిమానులు ఫిదా అవుతున్నారు. మరికొందరైతే వామ్మో ఇళ్లు ఈ రేంజ్‌లో ఉందా అని షాకవుతున్నారు. అంతేకాదండోయ్ ఈ వీడియోలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కూడా ఎంత క్లారిటీగా కనపడుతున్నాడో క్లిక్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓలుక్కేయండి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments