Allu Studios: అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించిన చిరంజీవి... తాతయ్య కల నెరవేర్చామన్న బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
దశబ్ధాల పాటు తెలుగు వారిని నవ్వుల జల్లులో తడిపిన దిగ్గజ నటుడు , పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నూతనంగా నిర్మించిన అల్లు స్టూడియోస్‌ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని గండిపేట్‌లో అల్లు స్టూడియోని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ని నిర్మించారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప 2ని ఇందులోనే తెరకెక్కిస్తారని సమాచారం. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్‌కి సమీపంలో వుండటం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో వుంటుందని ఫిలింనగర్ జనాలు అంటున్నారు.
అల్లు ఫ్యామిలీ ఇప్పుడో వ్యవస్థ: చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు వున్నా.. కొందరికే ఘనత, అప్యాయత లభిస్తుందని.. వారిలో అల్లు రామలింగయ్య ఒకరని చిరు అన్నారు. ఆయన చూపిన బాటలో అల్లు అరవింద్, బన్నీ, శిరీష్ , బాబీ విజయవంతంగా నడుస్తున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. నటుడిగా ఎదగాలనే అల్లు రామలింగయ్య గారి ఆలోచన నేడు ఓ వ్యవస్థగా మారిందని మెగాస్టార్ అన్నారు. అల్లు స్టూడియో మంచి లాభాలను తీసుకురావాలని.. ఈ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా వుందన్నారు.
ఈ స్టూడియోని కమర్షియల్‌గా కట్టలేదు: అల్లు అర్జున్
మరోవైపు .. అల్లు స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న గారికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ వుంది, చాలా భూములు వున్నాయి స్టూడియో కట్టడం విశేషం కాదని అందరూ అనుకున్నారని బన్నీ వ్యాఖ్యానించారు. కానీ ఈ స్టూడియో కట్టాలన్నత తాత గారి కోరిక అని .. మనందరికీ స్టూడియో వుంటే బాగుండేదని ఆయన అంటుండేవారని అల్లు అర్జున్ చెప్పారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించామని... ఇక్కడ సినిమాలు చిత్రీకరణ జరుపుకుని, చిత్ర పరిశ్రమకు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు బన్నీ స్పష్టం చేశారు. తాతయ్య మరణించి 18 ఏళ్లు గడుస్తున్నా నాన్న గారికి ఇంకా ప్రేమ తగ్గడం లేదు సరికాదా, ఇంకా పెరుగుతోందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout