ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ.. వెనక్కి జరిగిన ‘‘ఆచార్య’’ , రిలీజ్ ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో మిగిలిన పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు క్యూకడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన డేట్లు మార్చి ముందుకు తీసుకురావడమో, వెనక్కి తీసుకెళ్లడమో జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’కు సంబంధించి కూడా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. తొలుత ఈ మూవీని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదల విషయంలో సందిగ్థత తొలగిపోవడంతో ఏప్రిల్ 29న ఆచార్యను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం.. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచార్య యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన 'లాహె లాహె', 'నీలాంబరీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments