ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ.. వెనక్కి జరిగిన ‘‘ఆచార్య’’ , రిలీజ్ ఎప్పుడంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో మిగిలిన పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు క్యూకడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన డేట్లు మార్చి ముందుకు తీసుకురావడమో, వెనక్కి తీసుకెళ్లడమో జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’కు సంబంధించి కూడా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. తొలుత ఈ మూవీని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదల విషయంలో సందిగ్థత తొలగిపోవడంతో ఏప్రిల్ 29న ఆచార్యను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం.. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచార్య యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

More News

మార్చి 18 కాదు... ఏప్రిల్ 28 కాదు: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే, ఈసారి మాత్రం పక్కా...!!!

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.

మహేశ్ - త్రివిక్రమ్ మూవీ : పూజా కార్యక్రమాల కోసం సిద్ధమవుతున్న ‘‘ SSMB28 ’’

కోవిడ్ కేసుల తీవ్రత తగ్గడంతో ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది.

మనం పెట్టిందే చట్టం.. పోసేదే మద్యం : చియాన్ విక్రమ్ ‘‘మహాన్’’ టీజర్ అదిరిందిగా

విలక్షణ  నటుడు విక్రమ్‌కు తమిళంలో ఎంత పాపులారిటీ వుందో.. తెలుగులోనూ అంతే. రెండున్నర దశాబ్ధాల క్రితమే ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో నటించారు.

‘‘శేఖర్‌’’లో అర్మాన్ మాలిక్‌తో మెలోడీ సాంగ్.. రెండ్రోజుల్లో రికార్డింగ్, రాజశేఖర్ బర్త్‌డేకి రిలీజ్

ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా సినిమా కల్చర్ ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే.

NTR 30: ఫిబ్రవరిలో సెట్స్‌పైకి ఎన్టీఆర్-కొరటాల మూవీ, ముహూర్తం ఫిక్స్.. కథ ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను అభిమానులు స్క్రీన్ మీద చూసుకుని దాదాపు మూడేళ్లు కావొస్తోంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో