Chiranjeevi:వాల్తేర్ వీరయ్యకు శృతీహాసన్ గైర్హాజరు.. ఎవరైనా బెదిరించారేమో : చిరు సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi)హీరోగా బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలిరావడంతో చిత్రయూనిట్ మంచి జోష్‌లో వుంది. అయితే ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతీహాసన్ రాకపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. అంతేకాదు... దీనికి ముందు రోజు ఒంగోలులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శృతీహాసన్.. వైజాగ్ ఈవెంట్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అనారోగ్యం వల్లే తాను రాలేకపోయానంటూ ఆమె ముందే సోషల్ మీడియా ద్వారా చెప్పినప్పటికీ .. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
ఒంగోలులో ఏం తిన్నదో :
ఇదిలావుండగా..వాల్తేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శృతీహాసన్ (Shruti Haasan)పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒంగోలులో జరిగిన ఈవెంట్‌లో శృతీహాసన్ ఏం తిన్నదో తెలియదని, ఆమెకు జ్వరం వచ్చిందని అన్నారు. ఆమెను ఎవరైనా బెదిరించారేమో అంటూ చిరు సరదాగా కామెంట్ చేశారు. వాల్తేర్ వీరయ్యలో శృతీహాసన్‌ది కేవలం గ్లామర్ రోల్ మాత్రమే కాదని, ఆమెకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా వున్నాయని మెగాస్టార్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచారు. సినిమాలో తొలి 25 నిమిషాల్లో రెండు ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్‌లో వుంటాయంటూ చిరు లీక్ చేసే ప్రయత్నం చేయగా.. డైరెక్టర్ బాబీ అడ్డుకోవడం నవ్వులు పూయించింది.
జనవరి 13న మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే :
ఇకపోతే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న వాల్తేర్ వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, సత్యరాజ్, బాబీ సింహా, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments