Chiranjeevi:చిరంజీవి పెద్ద మనసు, చదువుకున్న కాలేజ్ కోసం రూ.50 లక్షలు.. ఆలస్యంగా వెలుగులోకి

  • IndiaGlitz, [Friday,May 05 2023]

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సమాజసేవ:

ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అంతేకాదు ఇండస్ట్రీలోని తన తోటి కళాకారులు ఎవరు కష్టాల్లో వున్నా సరే వారికి తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు చిరు. మొన్నామధ్య తమిళ నటులు పాకీజా, పొన్నాంబలంలకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్. ఇటీవల బలగం మొగిలయ్య అనారోగ్యం పాలైన సమయంలోనూ తానున్నానంటూ చికిత్సకు అవసరమైన ఆర్ధిక సాయం చేశారు.

ఎంపీగా ఆ కాలేజీ అభివృద్ధికి కృషి చేసిన చిరు :

తాజాగా చిరంజీవి తన పెద్దమనసును మరోసారి చాటుకున్నారు. ఆయన చదువుకున్న వైఎన్ కాలేజీకి చిరు 50 లక్షల సాయం చేశారట. అయితే ఇది ఇప్పుడు కాదు.. చిరంజీవి కాంగ్రెస్ తరపున ఎంపీగా వున్న సమయంలో ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.50 లక్షల నిధులే కాకుండా తన సొంతంగానూ సాయం చేస్తానని చిరంజీవి మాట ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు. కాగా.. వైఎన్ కాలేజీలో చిరంజీవితో పాటు దర్శకరత్న దాసరి నారాయణ రావు, రెబల్ స్టార్ కృష్ణంరాజు, దవళ సత్య, అనంత్ శ్రీరామ్ తదితరులు చదువుకున్నారు. దాసరి, కృష్ణంరాజులు కూడా ఎంపీలుగా వున్న సమయంలో ఒక్కొక్కరు రూ.10 లక్షల వరకు నిధులు రిలీజ్ చేశారట.

More News

Manichandana:గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ మణిచందన.. ఎన్టీఆర్‌కి అత్త రోల్‌, ఇక దశ తిరిగినట్లేనా..?

80, 90 దశకాలలో వెండితెరను ఒక ఊపు ఊపిన నటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.

Jailer:సూపర్‌స్టార్ రజనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ .. వేటకు సిద్ధమైన జైలర్.. రిలీజ్ డేట్ ఇదే

లేటు వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్.

Sarath Babu : విషమంగానే శరత్ బాబు ఆరోగ్యం.. హెల్త్ కండీషన్స్‌పై డాక్టర్ ఏం చెప్పారంటే ..?

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలిలోని ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Annapurna Photo Studio:తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సెకండ్ సాంగ్ లాంచ్

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న సినిమా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో".

Talasani:నంది అవార్డులపై కాంట్రవర్సీ.. ఎవరు పడితే వాళ్లు చెబితే మేం ఎందుకిస్తాం : తలసాని సంచలన వ్యాఖ్యలు

నంది అవార్డ్‌లపై ఇటీవల సినీ ప్రముఖులు పోసానీ కృష్ణమురళీ, అశ్వినీదత్‌ల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్