Brahmanandam:బ్రహ్మానందాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
- IndiaGlitz, [Thursday,March 23 2023]
ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. మంచి సినిమాకు ఆయన అండదండలు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'రంగమార్తాండ' సినిమా చూశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా తండ్రీ కుమారులకు నచ్చింది.
'రంగమార్తాండ' సినిమాలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, డాక్టర్ బ్రహ్మానందం నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయన నటనకు మెగా ప్రశంసలు లభించాయి. ఆయన నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ముగ్ధులయ్యారు. అంతే కాదు, బ్రహ్మానందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా సత్కరించారు. 'రంగమార్తాండ' సినిమాలో కనబరిచిన నటనను ప్రశంసించారు.