Chiranjeevi: నేనేం మాట్లాడాను, మీరేం రాశారు ?: మీడియాపై చిరంజీవి గుస్సా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ బారినపడ్డారంటూ మీడియాలో వస్తున్న కథనాలు చిత్ర సీమలో కలకలం రేపాయి. ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మీడియా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా స్పందించారు. తను ముందస్తు టెస్టులు చేయించుకోవడం గురించి మాత్రమే చెప్పానని, దీనిని మరోలా అర్ధం చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు ఇంకోలా వార్తలు రాశాయని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘కొద్దిసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి అని మాత్రమే అన్నాను.
ఇంత మందిని బాధపెట్టొద్దు :
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’’ అంటూ చిరు కాస్తంత సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments