మెగాస్టార్ 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న150వ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. సెన్సేషన్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం... భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడాని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ కి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న మెగాస్టార్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలోని ఐదు పాటలకు యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ 150వ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com