Anjana Devi : జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం.. తల్లి బర్త్ డే నాడు చిరు ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లకు వారి తల్లి అంజనా దేవి అంటే ప్రాణం. ఇంట్లో శుభకార్యాలతో పాటు వారి సినిమా ఈవెంట్స్‌కు ఆమె ఖచ్చితంగా వుండాల్సిందే. వీరిలో చిరంజీవి తల్లిని తన వద్దే వుంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమె చేతి వంట తింటూ.. అప్పుడప్పుడు తాను కిచెన్ ప్రయోగాలు చేసిపెడుతూ అమ్మకు తినిపిస్తూ వుంటారు. లాక్‌డౌన్ సమయంలో తన తల్లి కోసం ఇష్టమైన వంటకాలను స్వయంగా వండిపెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి.
చిరు ఇంట్లో సందడి చేసిన మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్:
ఇదిలావుండగా.. ఈరోజు అంజనాదేవి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె ఐదుగురు పిల్లలు చిరంజీవి ఇంట్లో వేడుకలు నిర్వహించారు. అమ్మకు కేక్ కట్ చేసి తినిపించడంతో పాటు ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితో పాటు రామ్‌చరణ్, ఉపాసన మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం అంటూ చిరు ట్వీట్ చేశారు.
తల్లిపై ప్రేమను చాటుకున్న నాగబాబు :
అటు నాగబాబు కూడా అమ్మపై తన ప్రేమను చాటుకున్నారు.నువ్వు మాపై కురిపించిన ప్రేమ, ఆదరణ పట్ల జీవితాంతం రుణపడి వుంటాం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన తల్లి, సోదరీ సోదరులతో దిగిన ఫోటోను నాగబాబు షేర్ చేశారు. ఇందులో అంజనా దేవి, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, విజయ, మాధవి వున్నారు.
తండ్రి సంవత్సరీకం నాడు చిరు ఎమోషనల్ :
ఇదిలావుండగా.. గతేడాది తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగానూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటున్నాం’’ అంటూ ఆయన తండ్రిపై ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, తన భార్య సురేఖ, సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్, చెల్లెళ్లు విజయ, మాధవితో దిగిన పాత ఫోటోను చిరు షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments