Chiranjeevi:నన్ను తమ్ముడూ అంటూ అప్యాయత ... కైకాల మరణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

దిగ్గజ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ Kaikala Satyanarayana)మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికే కృష్ణంరాజు, కృష్ణల మరణంతో తీవ్ర విషాదంలో వున్న టాలీవుడ్‌కు తాజాగా కైకాల నిష్క్రమణతో షాక్ తగిలినట్లయ్యింది. ఆయన మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కైకాల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar)తో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. చిరు హీరోగా ఎదుగుతున్న సమయం నుంచి ఇవాళ్టీ వరకు వారిద్దరూ ఎంతో సన్నిహితంగా వుండేవారు. గతేడాది కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలోనూ మెగాస్టార్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. తాజాగా కైకాల మరణంతో చిరు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఆయన పాత్రలు మరొకరు పోషించి వుండరు :

‘‘శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.

తోడబుట్టినవాడిలా ఆదరించారు:

‘‘ శ్రీ కైకాల సత్యన్నారాయణ గారితో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను 'తమ్ముడూ' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి’’.

సురేఖ చేతివంట అంటే ప్రాణం :

‘‘నటన, రుచికరమైన భోజనం రెండూ శ్రీ కైకాల సత్యన్నారాయణ (Kaikala Satyanarayana)గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ గారు సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం అని అన్నాము. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు ’’.

కైకాల కుటుంబానికి చిరంజీవి (Chiranjeevi)సంతాపం:

‘‘ శ్రీ కైకాల సత్యన్నారాయణ (Kaikala Satyanarayana)గారు గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

More News

Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో మరో విషాదం.. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

దిగ్గజ నటులు కృష్ణ, కృష్ణంరాజుల మరణాలతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. ఆ తరానికి ప్రతినిధిగా వున్న మరో నట దిగ్గజం, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.

Khairatabad RTA Office: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి పవన్ ... దగ్గరుండి జనసేన వాహనాల రిజిస్ట్రేషన్

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు.

New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోన్న హైదరాబాదీలు.. పోలీసుల నిబంధనలు, ఉల్లంఘిస్తే..?

మరికొద్దిరోజుల్లో క్యాలెండర్‌ మారనుంది. 2022 కాలగర్భంలో కలిసిపోయింది.

Satyam Rajesh:సత్యం రాజేష్ కొత్త చిత్రం ప్రారంభం!!!

సత్యం రాజేష్, రిహ, సునీత హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో

Omicron BF 7 Variant : కమ్ముకొస్తున్న కోవిడ్ ముప్పు... కాసేపట్లో మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష

మానవాళిని రెండేళ్ల పాటు నాలుగు గోడల మధ్య బందీని చేసి ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి పీడ వదిలిపోయిందని