మెగాస్టార్ 'డాడీ'కి 16 ఏళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్టర్ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేష్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం డాడీ. మాస్టర్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం విశేషం. టైటిల్ రోల్‌లో చిరంజీవి పాత్ర, నటన ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవగా.. అతని కూతురు పాత్రలో నటించిన బేబి అక్షయ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు అలరించేలా ఉంటాయి.
చిరంజీవి సరసన సిమ్రాన్ నటించిన ఈ సినిమాలో ఆషిమా భల్లా మరో హీరోయిన్‌గా నటించింది. కథానాయకుడిగా కెరీర్‌ని ప్రారంభించకముందు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీతంలో పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, అచ్యుత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు కెమెరామేన్‌గా వ్యవహరించారు. 97 కేంద్రాల్లో 50 రోజులను.. 15 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుందీ చిత్రం. అక్టోబర్ 4, 2001న విడుదలైన డాడీ.. నేటితో 16 ఏళ్లను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com