Chiranjeevi: కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది.. బింబిసార, సీతారామంపై చిరు ప్రశంసలు

యువతను, ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలను వీక్షించి ఆయా చిత్ర యూనిట్‌లను ప్రశంసిస్తూ వుంటారు. చిన్నా, పెద్ద హీరోల సినిమాల ఫంక్షన్‌లకు చీఫ్ గెస్ట్‌గా వెళ్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు చిరు. తాజాగా 'సీతారామం', 'బింబిసార‌' చిత్రాల‌పై ఆయన ప్ర‌శంస‌లు కురిపించారు . ఈ మేరకు చిరంజీవి శనివారం ట్వీట్ చేశారు. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు 'బింబిసార', 'సీతారామం' హిట్ టాక్‌ తెచ్చుకోవడం విశేషమన్నారు. ఓ సినిమా మాస్‌ కమర్షియల్‌ అంశాలతో మాస్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్‌ లవ్‌ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతోందని చిరు మెచ్చుకున్నారు. ఇలా 'బింబిసార', 'సీతారామం' రెండూ విజయవంతంగా రన్‌ అవుతున్నాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది:

ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్‌ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని నిరూపిస్తూ ఈ రెండు చిత్రాలు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా 'సీతారామం', 'బింబిసార' చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు చిరంజీవి.

చాలా రోజులకు హౌస్‌ఫుల్ బోర్డులు : విజయ్ దేవరకొండ

అటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం బింబిసార, సీతారామం చిత్రాలపై ప్రశంసలు కురిపించారు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు విజయం సాధించడం ఆనందంగా వుందన్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తున్నానని.. ఒకే రోజున రెండు సినిమాలు విడుదలై, రెండూ విజయం సాధించడం సంతోషంగా వుందన్నారు. ఈ సందర్భంగా బింబిసార, సీతారామం చిత్ర నటీనటులు, సాంకేతిక బృందం, నిర్మాతలు, దర్శకులకు విజయ్ అభినందనలు తెలియజేశారు.

More News

Janasena : సంక్షేమ పథకాలు అందడం లేదంటే కేసులు పెడతారా : జగన్‌ ప్రభుత్వంపై నాదెండ్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గడప గడపకు కార్యక్రమంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

Janasena : ఓఎన్జీసీపై రెండేళ్ల న్యాయపోరాటం .. ఎట్టకేలకు విజయం : జనసైనికుడిని అభినందించిన నాగబాబు

చమురు, సహజ వాయువుల సంస్థలైన గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై గత రెండేళ్లుగా న్యాయ పోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గంకు చెందిన జనసైనికుడు వెంకటపతి రాజాను అభినందించారు

Gorantla Madhav : నువ్వేమైనా టామ్‌క్రూజ్‌వా.. నీ సుందర ప్రతిబింబం చూసి జనానికి ఏమైందో : చింతకాయల విజయ్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Gorantla Madhav : అది మార్ఫింగ్ వీడియో కాకుంటే.. మాధవ్‌పై కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

'లక్కీ.లక్ష్మణ్‘ సినిమా నుంచి "అదృష్టం హలో అంది రో.. చందమామ" టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో