Chiranjeevi: కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది.. బింబిసార, సీతారామంపై చిరు ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
యువతను, ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలను వీక్షించి ఆయా చిత్ర యూనిట్‌లను ప్రశంసిస్తూ వుంటారు. చిన్నా, పెద్ద హీరోల సినిమాల ఫంక్షన్‌లకు చీఫ్ గెస్ట్‌గా వెళ్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు చిరు. తాజాగా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు . ఈ మేరకు చిరంజీవి శనివారం ట్వీట్ చేశారు. ఆగస్ట్ 5 న విడుదలైన రెండు సినిమాలు `బింబిసార', `సీతారామం' హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషమన్నారు. ఓ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంటే, మరో సినిమా స్వచ్ఛమైన ప్రేమ కథతో, పొయెటిక్ లవ్ స్టోరీతో క్లాసీ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతోందని చిరు మెచ్చుకున్నారు. ఇలా `బింబిసార`, `సీతారామం' రెండూ విజయవంతంగా రన్ అవుతున్నాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది:
"ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ, మరింత ప్రోత్సాహాన్నిస్తూ కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని నిరూపిస్తూ ఈ రెండు చిత్రాలు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా `సీతారామం`, `బింబిసార` చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు చిరంజీవి.
చాలా రోజులకు హౌస్‌ఫుల్ బోర్డులు : విజయ్ దేవరకొండ
అటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం బింబిసార, సీతారామం చిత్రాలపై ప్రశంసలు కురిపించారు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు విజయం సాధించడం ఆనందంగా వుందన్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తున్నానని.. ఒకే రోజున రెండు సినిమాలు విడుదలై, రెండూ విజయం సాధించడం సంతోషంగా వుందన్నారు. ఈ సందర్భంగా బింబిసార, సీతారామం చిత్ర నటీనటులు, సాంకేతిక బృందం, నిర్మాతలు, దర్శకులకు విజయ్ అభినందనలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com