మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మాట్లాడుతూ “మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్‌కి రావడానికి అంగీకరించినందుకు చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సినిమా ఫంక్షన్‌కు మీరు రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. మా యూనిట్ అంతా ఈ ఫంక్షన్‌ను ఓ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది. సర్, మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ సోమవారం విడుదల కానున్న నాలుగో పాట క్లాస్ సాంగ్‌గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట కోసం యూరప్‌లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవి. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
#SarileruNeekevvaru pre-release event on JAN 5th! pic.twitter.com/cXkf1Wj1nG
— Mahesh Babu (@urstrulyMahesh) December 20, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments