తారక్‌తో మాట్లాడాను.. ఆ విషయం తెలిసి సంతోషించా: చిరంజీవి

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఇటీవల కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి తారక్‌తో మాట్లాడారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. తారక్ చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నాడని తెలుసుకుని చాలా సంతోషించానని చిరు వెల్లడించారు. ‘‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. తను, తన కుటుంబ సభ్యులు బాగానే ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్’’ అని ట్వీట్ చేశారు.

తారక్‌కు చిరు ఫోన్ చేశానంటూ చేసిన ట్వీట్‌పై అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మెగాస్టార్ గొప్పతనాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మెగాస్టార్ అందరినీ కలుపుకుపోతారని.. ఆయన అందరివాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తారక్‌కు గత సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది అప్పటి నుంచి తారక్ తన కుటుంబంతో సహా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ భయపడాల్సిన పని లేదని గత సోమవారం ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాం. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోమవారం తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More News

15 రోజుల తర్వాత కుటుంబాన్ని కలిసిన బన్నీ.. వీడియో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బన్నీకి కొడుకు, కూతురు నుంచి ఘన స్వాగతం లభించింది.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఈటల.. రోజుకో నేతతో భేటీ

కరోనా సమయాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్

తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలు, కార్యాలయాలపై పడుతోంది. మరోవైపు దేవాలయాలు సైతం మరోసారి మూతబడ్డాయి.

ఏపీలో రంజాన్‌ పండుగ మార్గదర్శకాల విడుదల

విజయవాడ: కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో లాక్‌డైన్ విధించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.