Chiranjeevi:లగ్జరీ కారు కొన్న మెగాస్టార్.. ధర, ఫీచర్స్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. !!
- IndiaGlitz, [Wednesday,April 12 2023]
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు. ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చిరు బిజీ :
ఏడు పదులకు చేరువ అవుతున్నప్పటికీ.. ఈ వయసులోనూ చిరు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి సినిమాలు చేస్తూ చిరంజీవి తనలో ఏ మాత్రం వాడి తగ్గలేదని నిరూపించారు. గతేడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యగా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
చిరు కొత్త కారుకు అదిరిపోయే ఫీచర్లు :
కాగా.. చిరంజీవికి కార్లంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన గ్యారేజ్‌లో ఎంతో ఖరీదైన , విలాసవంతమైన కార్లు వున్నాయి. రోల్స్ రాయిస్ కారు వాడే అతికొద్దిమంది తెలుగువారిలో చిరు కూడా ఒకరు. తాజాగా చిరు గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ కారు చేరింది. రీసెంట్‌గా ఆయన టొయోటా వెల్‌ఫైర్ కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాల సుమారు రూ.1.9 కోట్లని సమాచారం. అంతేకాదు.. బ్లాక్ కలర్‌లో రాజసం ఉట్టిపడే ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరు అక్షరాల రూ.4.70 లక్షలు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. అనంతరం తెలంగాణ రవాణా శాఖ ఆయనకు ‘‘టీఎస్09 జీబీ1111’’ నెంబర్ కేటాయిచింది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ కారులో ఏడుగురు ప్రయాణీకులు ప్రశాంతంగా కూర్చొని వెళ్లవచ్చు.