ఎమోషనల్ వీడియోతో చెర్రీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా అటు ‘ఆర్ఆర్ఆర్’ ఇటు ‘ఆచార్య’ ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ‘ఆచార్య’ గిఫ్ట్ అయితే వేరే లెవల్. తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామ్ చరణ్ గన్స్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న పోస్టర్‌ను ‘ఆచార్య’ యూనిట్ వదిలింది. దానిని చూసిన మెగాస్టార్, మెగా పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అలాగే.. చెర్రీకి పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే మెగాస్టార్ నుంచి తమ హీరోకి ఇంకా విషెస్ రావడం లేదేంటని చెర్రీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే చిరు కాస్త లేటు అయినా లేటెస్ట్‌గా విషెస్ చెప్పారు. అదిరిపోయే అనే కంటే మనసుకి హత్తుకునే ఒక ప్రత్యేక వీడియోతో చెర్రీకి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చెర్రీకి విషెస్ చెబుతూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై బాయ్’ అంటూ వీడియోను చిరు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి నటించిన డాడీ చిత్రంలోని ‘గుమ్మాడి గుమ్మాడి’ పాట మ్యూజిక్ బ్యాగ్రౌండ్‌లో వస్తుంటుంది.
ఇక మొదట రామ్ చరణ్ చిన్నగా ఉన్నప్పుడు తనకు గొడుగు పట్టుకున్న ఫోటోతో ‘అప్పుడు’ అని.. పెద్దయ్యాక పక్కన కూర్చొని గొడుగు పట్టుకున్న ఫోటోతో ‘ఇప్పుడు’ అని.. రీసెంట్‌గా ‘ఆచార్య’ సెట్‌లో తనకు చెర్రీ గొడుగు పట్టుకుని నిలుచున్న ఫోటోతో ‘ఎల్లప్పుడూ తనొక కేరింగ్ సన్’ అంటూ వీడియో ద్వారా చిరు వెల్లడించారు. చివరగా సతీమణి సురేఖ, తనయుడు చెర్రీతో ఉన్న ఫొటోను చిరంజీవి వీడియోలో జత చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా బానం విసురుతున్న చెర్రి లుక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేసి.. ‘ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్‌చరణ్’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు.
Happy Birthday My Boy @AlwaysRamCharan pic.twitter.com/iKRZ0G8Ji5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments