Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు .. వేదిక ఇదే, తరలిరానున్న అతిరథ మహారథులు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కృష్ణల తర్వాత అంతటి మాస్ హీరోగా.. ఎన్టీఆర్ తర్వాత నెంబర్‌వన్ హీరోగా తెలుగు తెరను దశాబ్ధాలుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి మంగళవారం తన 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఏళ్ల నుంచి ఆగస్ట్ 22 అంటే తెలుగువారికి ఒక పండుగ రోజు. ఆ రోజున వూరారా రక్తదానాలు, అన్నదానాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలతో పాటు టీవీల్లో వచ్చే చిరంజీవి సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతావరణం నెలకొంటుంది.
జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా భారీ ఏర్పాట్లు :
తాజాగా ఈసారి కూడా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల్లో వున్న తెలుగువారు , అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చిరంజీవికి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు కనివినీ ఎరుగని స్థాయిలో చిరు పుట్టినరోజులు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
మెగా హీరోలతో పాటు తరలిరానున్న సినీ ప్రముఖులు :
ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారికతో పాటు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రతి పుట్టినరోజుకు తన సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకునే మెగాస్టార్.. ఈసారి కూడా తాను తర్వాత చేయబోయే సినిమాపై కీలక ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com