Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు .. వేదిక ఇదే, తరలిరానున్న అతిరథ మహారథులు

  • IndiaGlitz, [Tuesday,August 22 2023]

టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కృష్ణల తర్వాత అంతటి మాస్ హీరోగా.. ఎన్టీఆర్ తర్వాత నెంబర్‌వన్ హీరోగా తెలుగు తెరను దశాబ్ధాలుగా ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి మంగళవారం తన 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఏళ్ల నుంచి ఆగస్ట్ 22 అంటే తెలుగువారికి ఒక పండుగ రోజు. ఆ రోజున వూరారా రక్తదానాలు, అన్నదానాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలతో పాటు టీవీల్లో వచ్చే చిరంజీవి సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతావరణం నెలకొంటుంది.

జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా భారీ ఏర్పాట్లు :

తాజాగా ఈసారి కూడా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల్లో వున్న తెలుగువారు , అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చిరంజీవికి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు కనివినీ ఎరుగని స్థాయిలో చిరు పుట్టినరోజులు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.

మెగా హీరోలతో పాటు తరలిరానున్న సినీ ప్రముఖులు :

ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారికతో పాటు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రతి పుట్టినరోజుకు తన సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకునే మెగాస్టార్.. ఈసారి కూడా తాను తర్వాత చేయబోయే సినిమాపై కీలక ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More News

Pawan Kalyan:సన్నని వాగు మహానదిగా మారినట్లు : హ్యాపీ బర్త్ డే అన్నయ్య ..అంటూ పవన్ ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు.

CM KCR:కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. టిక్కెట్ దక్కని ఇద్దరికి మంత్రులుగా ఛాన్స్, ఎల్లుండే ప్రమాణ స్వీకారం

వచ్చే ఎన్నికలకు సంబంధించి 115 మంది అభ్యర్ధులతో బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు.

Weapon:వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ 'వెపన్'.. యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ టీజర్

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఏడుగురు సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా

కొద్దినెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి జాబితా ప్రకటించారు. 115 మందితో ఆయన సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జాబితా విడుదల చేశారు.

YS Jagan:చంద్రబాబు మాటలు నమ్మొద్దు.. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, దసరాకి పెండింగ్ డీఏ : ఏపీ ఎన్జీవో సభలో జగన్

ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.