దాసరికి తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం తీరని లోటు: చిరంజీవి
- IndiaGlitz, [Tuesday,May 04 2021]
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా దాసరి గిన్నిస్ రికార్డ్ సాధించారు. దాదాపు 150 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అంతేకాదు.. నిర్మాతగా మారి 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. నటుడిగా కూడా మంచి పేరును సంపాదించారు.
Also Read: ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ
తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. అలాంటి దాసరికి ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు రాలేదని చిరు తన ట్వీట్‌లో వాపోయారు. ఆయనకు పోస్త్యుమస్‌గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుందని చిరు అభిప్రాయపడ్డారు. నిరంతరం చిత్ర పరిశ్రమ లోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమేనని చిరు పేర్కొన్నారు.
‘‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒక దానికి మించిన మరో చిత్రాలను తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే! శ్రీ దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవటం ఒక తీరని లోటు. ఆయనకు పోస్త్యుమస్‌గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరవమవుతుంది’’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.
#RememberingALegend #DrDasari #PadmaForDrDasari pic.twitter.com/pasn1g2YWr
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2021