Neelima Guna: గుణ శేఖర్ కుమార్తె వివాహ వేడుకలో మెగాస్టార్, ఇతర సినీ ప్రముఖులు
- IndiaGlitz, [Saturday,December 03 2022]
ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ కుమార్తె, శాకుంతలం మూవీ ప్రొడ్యూసర్ అయిన నీలిమ గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) .. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు అయిన డా.రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు రవి ప్రఖ్యాతో జరిగింది. అంగ రంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ వేదిక అయ్యింది. అయితే ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, డైరెక్టర్లు మెహెర్ రమేష్, అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.