మెగాస్టార్‌ని ఢీకొట్టబోతున్న స్టైలిష్ స్టార్?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో మెయిన్‌టైన్ చేయలేక థియేటర్ యాజామాన్యాలు సైతం థియేటర్లను తాత్కాలికంగా మూసివేశాయి. అయితే ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ నెలకోవడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఈ నెలలో రిలీజ్ కావాల్సిన గొపీచంద్ 'సీటీమార్', శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరి', నాని నటించిన 'టక్ జగదీష్', రానా - సాయి పల్లవిల 'విరాట పర్వం' సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాని సైతం పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ఆయా చిత్రాల మేకర్స్ ప్రకటించారు. మళ్ళీ ఈ సినిమా రీ షెడ్యూల్ డేట్ ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక మేలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల 'అఖండ', మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న 'ఖిలాడి' సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఆయా చిత్ర బృందాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

వీటన్నింటినీ పక్కనబెడితే మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఆగస్టు 13న భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అప్పటికి పరిస్థితులు కొంతమేర చక్కబడి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ‘ఆచార్య’ తదుపరి రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకున్నా కూడా ఈ చిత్రం ఆగస్ట్ రెండవ వారంలో తప్పక విడుదలవుతుందని టాక్ నడుస్తోంది. మొత్తానికి మెగాస్టార్‌ని స్టైలిష్ స్టార్ ఢీకొట్టడం ఖాయమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మామా.. మేనల్లుళ్లలో ఎవరు ఎక్కువ సందడి చేస్తారో చూడాలి.

More News

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది.

మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

ఇండియా తనకు రెండో ఇల్లు అంటూ బ్రెట్‌లీ భారీ విరాళం

భారత్‌లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.