మెగా సర్‌ప్రైజ్ అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్‌ను మిక్స్ చేసి మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలు చేసిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ నటించున్నాడనేది దాదాపు ఖాయమైంది. చిత్ర యూనిట్ నుండి కన్‌ఫర్మేషన్ మెసేజ్ రావాల్సి ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దేవదాయ భూములను కాపాడే నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనపడతాడని కూడా వార్తలు వినపడుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో చిరంజీవి లుక్ కూడా లీకై సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments