ప్రారంభమైన మెగాస్టార్ 'భోళా శంకర్ '.. 15 నుండి రెగ్యులర్ షూటింగ్, క్యాస్ట్ అండ్ క్రూ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్యను పూర్తి చేసిన ఆయన.. భోళా శంకర్, గాడ్ ఫాదర్లతో పాటు ఇటీవల బాబీ దర్శకత్వంలో తన 154వ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ ప్రారంభైమంది. గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ‘‘ భోళా శంకర్ ’’ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ కార్యక్రమానికి దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ముహుర్తపు షాట్లో భాగంగా దర్శకేంద్రుడు.. చిరుపై క్లాప్ కొట్టారు.
తమిళ సూపర్ హిట్ మూవీ ‘‘ వేదాళం’’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘‘భోళా శంకర్ ’’. ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సాగర్ స్వరాలు సమకూర్చనున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
ఈ చిత్రంలో చిరు విభిన్నమైన లుక్‌లో గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్ టాక్. మరోవైపు భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలనీ మెగాస్టార్.. దర్శకుడు మెహర్ రమేశ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది . మొత్తం 40 నుండి 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేయాలని చిరంజీవి చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com