‘‘ మీరు ఇంటికి తిరిగి రావాలి.. సెలబ్రేట్ చేసుకోవాలి’’.. కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్లో మాట్లాడానని, తన మాటలకు కైకాల స్పందిస్తున్నారని చిరు తెలిపారు. ఈ మేరకు కైకాల ఆరోగ్యంపై ఆయన ఓ ట్వీట్ చేశాడు.
‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు.
మరోవైపు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని .. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు.
#GetWellSoonKaikalaGaru #KaikalaSatyanarayana#NavaRasaNatanaSarvabhouma pic.twitter.com/Log3ohKtnz
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments