రాజకీయాలలోకి అనవసరంగా వెళ్లా.. తాప్సీతో ఛాన్స్ మిస్ అయ్యా: చిరు హాట్ కామెంట్స్
- IndiaGlitz, [Thursday,March 31 2022]
అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ పన్ను తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే. అక్కడ తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే అనుకున్న స్థాయిలో కాకపోయినా ఓ మాదిరిగా తాప్సీకి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఈ సొట్టబుగ్గల సుందరి తెలుగు వారిని పలకరించేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ మిషన్ ఇంపాజిబుల్’. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు దర్శకత్వం వహించిన స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మిషన్ ఇంపాజిబుల్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. .
ఈ ఈవెంట్లో చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తాప్సీని ఆకాశానికి ఎత్తేశారు. తాప్పీ నటించిన 'ఝుమ్మందినాదం' చిత్ర ఈవెంట్‌కి వెళ్లానని.. అక్కడ ఆమె ఎంతో క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపించిందన్నారు. అలాంటిది 'పింక్' చిత్రంలో పవర్ఫుల్ ప్యాక్‌తో ఎంతో బలమైన పాత్రలో ఆమె పర్ఫెర్మెన్స్ చూస్తుంటే వాహ్ అనిపించిందని చిరంజీవి ప్రశంసించారు. లవ్లీగా ఉన్న క్యూట్ బేబీలా ఉందనుకున్న ఈ అమ్మాయేనా అనిపించిందని.. అలా అద్భుతమైన నటిగా ట్రాన్స్ ఫామ్ అయ్యిందని చిరు అన్నారు. బాలీవుడ్లో తన మార్క్‌ని చాటుకుంటూ... అద్భుతమైన సినిమాలు చేస్తోందని కొనియాడారు. ఆమె ఈ సినిమాలో ఉందని తెలిసి 'మిషన్ ఇంపాజిబుల్'పై ఆకర్షణ కలిగింది అని చిరు తెలిపారు
కానీ అప్పట్లో నేను రాజకీయాల్లోకి వెళ్లిపోయానని.. తనతో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఎందుకు పాలిటిక్స్ వెళ్లానా అనిపిస్తుందంటూ చిరు పేర్కొన్నారు. నెక్ట్స్ ఆమెతో కలిసి నటించేలా ఓ ప్రాజెక్ట్స్ సెట్ చేయమని నిర్మాత నిరంజన్‌రెడ్డిని రిక్వెస్ట్ చేశారు చిరు. మరోవైపు నిర్మాతలపైనా మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నిర్మాతలు సినిమా కథల్లోనూ భాగమయ్యే వారని, చర్చల్లో పాల్గొనేవారని, సినిమా జరుతున్న సమయంలోనూ వారు ఇన్వాల్వ్ అయ్యేవారని గుర్తుచేశారు. కానీ రాను రాను నిర్మాత అనేవాడు ఫైనాన్షియర్‌గా మారిపోయాడని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. సినిమా కథల్లో అతని భాగస్వామ్యం తగ్గిపోయిందని, దీంతో ఎలాంటి సినిమా తీస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.