త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో : జగన్‌తో భేటీ అనంతరం చిరు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా టికెట్ ధరలు, ఇతర టాలీవుడ్‌కు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీనటుడు చిరంజీవి భేటీ ముగిసింది. అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిరు మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ ధరల విషయంపై జగన్‌తో జరిగిన చర్చ సంతృప్తినిచ్చిందన్నారు. తనకెంతో ఆనందంగా ఉందని.. సీఎం తనను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించారని చిరు పేర్కొన్నారు.
తనను ఎంతగానో ఆదరించిన వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉందని.. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని మెగాస్టార్ సూచించారు. ఆయన తన పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించిందని.. సినీ పరిశ్రమలో ఎవరూ మాట జారొద్దని చిరంజీవి కోరారు.
సామాన్యుడికీ వినోదం అందుబాటులో ఉండాలన్న జగన్ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమానుల సమస్యల గురించి ఆయనకు వివరించానన్నారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారని... ఆమోదమైన నిర్ణయం తీసుకుంటానని, కమిటీ తుది నిర్ణయానికొస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. త్వరలో సినీ పరిశ్రమకు అనుకూలంగా జీవో వస్తుందని చిరు పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments