1000 డ్యాన్స‌ర్స్‌తో మెగా సాంగ్‌!

  • IndiaGlitz, [Saturday,January 26 2019]

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రాంచ‌ర‌ణ్‌ నిర్మాత. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, త‌మన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్ తది తరులు నటిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

ఈ సినిమా కోసం రాంచ‌ర‌ణ్ భారీగా ఖ‌ర్చు పెడుతున్నాడు. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తెలుగు సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్‌తో ఓ పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. అందుకోసం రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ వేస్తున్నారు. ఈ సాంగ్‌లో 1000 మంది డ్యాన్స‌ర్స్ ఉంటార‌ట‌. 12 రోజుల పాటు పాట‌ను చిత్రీక‌రిస్తార‌ని టాక్‌. ఈ చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మికి వ‌డుద‌ల చేయాల‌నేది నిర్మాత రాంచ‌ర‌ణ్ ప్లాన్‌.