Geetha Arts : ‘‘గీత’’ అంటే నా గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు.. బ్యానర్ పేరు వెనుక కథ ఇదే : అల్లు అరవింద్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తోన్న నలుగురిలో ఒకరు అల్లు అరవింద్. ఇక దేశంలోని బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. తండ్రి అల్లు రామలింగయ్య అడుగు జాడల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు అల్లు అరవింద్. అంతేనా.. మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా దశాబ్ధాలుగా కుటుంబ బాధ్యతలు మోస్తున్నారాయన. చిత్ర నిర్మాణం, పంపిణీలతో పాటు పలు వ్యాపారాలను కూడా అల్లు అరవింద్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన సారథ్యంలోనే ఆహా ఓటీటీ సంస్థ రూపుదిద్దుకుని.. విజయవంతంగా దూసుకెళ్తోంది. అలాగే హైదరాబాద్ శివార్లలో అల్లు స్టూడియో నిర్మించి.. స్టూడియో అధినేత అనే హోదాను కూడా దక్కించుకున్నారు అరవింద్.
అలీతో సరదాగాలో స్టార్ ప్రొడ్యూసర్ మనోగతం:
ఇన్నేళ్ల ప్రస్థానంలో మీడియాకు టచ్‌లోనే వుంటూ.. సినిమా ఈవెంట్లకు హాజరవుతూనే వున్నప్పటికీ అల్లు అరవింద్ ఇంటర్వ్యూలు ఇచ్చింది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో అలీ హోస్ట్‌గా... ఈటీవీలో ప్రసారమవుతోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా అల్లు అరవింద్ వచ్చారు. రెండు భాగాలుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు.
నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ వుంది:
ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్‌లో ‘‘గీత’’ అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. గీత అనే తన గర్ల్‌ఫ్రెండ్ పేరు పెట్టానని ఇప్పటికీ రూమర్ వుందని.. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అరవింద్ చెప్పారు. కానీ తనకు గీత అనే పేరు గల గర్ల్ ఫ్రెండ్ వున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే వాస్తవానికి ‘‘గీతా ఆర్ట్స్’’ అనే పేరును సూచించింది అల్లు రామలింగయ్య అని అరవింద్ తెలిపారు. భగవద్గీతలో ప్రయత్నం మాత్రమే మనదని.. ఫలితం మన చేతిలో వుండదు అనేది సారాంశమని అది సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుందని నాన్న గారు చెప్పడం వల్ల బ్యానర్‌కు ‘‘గీతా ఆర్ట్స్’’ అనే పేరు పెట్టామని అరవింద్ స్పష్టం చేశారు. అయితే దీనికి మీ సతీమణి పేరుతో ‘‘నిర్మల ఆర్ట్స్’’ అని మార్చొచ్చు కదా అని అలీ ప్రశ్నించగా.. గీతా ఆర్ట్స్ పేరు మీద ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు వచ్చాయని అందుకే మార్చడం లేదని అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. సో.. అదన్నమాట అసలు విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout