Ram Charan : జీబ్రా చారల చొక్కాలో స్టైలిష్‌గా రామ్‌చరణ్.. షర్ట్ ఖరీదు అక్షరాలా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌చరణ్ తేజ్... ఈ పేరు తెలియని వారుండరు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చెర్రీ తన ప్రతిభతో ఇప్పుడు మెగా పవర్ స్టార్‌గా ఎదిగాడు. నటన, డ్యాన్సులు, ఫైట్స్‌లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాలకు కూడా సై అంటూ దర్శకుల హీరో అనిపించుకున్నాడు. తనలో వున్న ఒక్కో మైనస్‌ను తొలగించుకుంటూ వాటినే ప్లస్‌గా మార్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు చరణ్ . ఈ ఏడాది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌తో ఘన విజయం అందుకున్నాడు.
ఫ్యాషన్ విషయంలో తగ్గేదే లేదంటున్న మెగా పవర్ స్టార్:
ఇకపోతే.. ఈ తరం హీరోల్లో స్టైలీష్‌గా కనిపించే వారిలో చరణ్ కూడా ఒకరు. షూ, కాస్ట్యూమ్స్, కళ్లజోడు, కార్లు, ఇతర గాడ్జెట్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా వుంటారు చరణ్. ఆయనకు ప్రత్యేకమైన క్లాసిక్ లగ్జరీ టైమ్ పీస్ (వాచ్)లను సేకరించే అలవాటుంది. వీటి విలువ లక్షల నుంచి రూ.కోట్ల వరకు వుంటుంది. తాజాగా చరణ్ ధరించిన చారల డిజైన్ షర్ట్ వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌తో డిజైన్ చేసిన ఈ షర్ట్ ధర రూ. 2 లక్షలు అని తెలుస్తోంది. అంతేకాకుండా వైట్ డెనిమ్ జీన్స్‌తో స్ప్రెడ్ కాలర్ షర్ట్‌లో చరణ్ చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీకి , అభిమానులకు ఉపాసన గుడ్‌న్యూస్:
ఇదిలావుండగా.... రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఉపాసన గర్భం దాల్చినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 2012 జూన్ 14న చరణ్- ఉపాసనల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు శుభవార్త చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు వీరి ప్రార్థనలు ఫలించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments