Ram Charan, Upasana:క్లీంకారాతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో తళుక్కుమన్న రాంచరణ్, ఉపాసన.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనా దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి మెగా ఫ్యామిలీ ‘‘క్లీంకారా’’గా నామకరణం చేసింది. పాప పుట్టిన వేళా విశేషం బాగుందని ఆమె వచ్చాక తమకు అన్ని సక్సెస్‌లే వస్తున్నాయని మెగా ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంటోంది. చిన్నారితో కలిసి ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న చరణ్ దంపతులు తాజాగా పాపతో కలిసి క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఉపాసన రెడ్ కలర్ డ్రెస్‌లో కలర్ ఫుల్‌గా కనిపించి.. అందమైన చిరునవ్వుతో మెరిసిపోతుండగా.. చెర్రీ బ్లాక్ సూట్‌లో స్టైలీష్‌గా వున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే.. ఇటీవల క్లీంకారాకు ఆరు నెలలు నిండటంతో ఆమెను తీసుకుని రాంచరణ్ - ఉపాసన దంపతులు ముంబైలోని మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ తమ కుమార్తె పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో చరణ్ దంపతుల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిని చూసేందుకు , సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటెత్తారు. ఆ వెంటనే రామ్ చరణ్, ఉపాసనలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే .. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ నటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com