లాక్డౌన్ లేడీస్ అంటూ వితవుట్ మేకప్‌తో. మెగా లేడీస్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ద్వారా సినీ కార్మికుల కష్టాలను తీరుస్తున్నారు. అలాగే రక్తదానం చేయమని తన అభిమానులకు పిలుపు నిచ్చారు. అయితే ఈ పనులను ఆయన ఇంటి దగ్గర నుండే పర్యవేక్షిస్తున్నారు. కాగా.. మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ అందరూ నో మేకప్ లుక్స్, విత్ మేకప్ లుక్స్ అలరించారు. క్వారంటైన్ టైమ్‌లో అందరూ ఇళ్లకే పరిమితమై ఉన్న సమయంలో మెగా కుటుంబానికి చెందిన మహిళలందరూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగాస్టార్ కుమార్తెలు సుస్మిత, శ్రీజతో పాటు నిహారికతో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహ సహా మరికొంత మంది మహిళలు ఈ వీడియోలో పార్టిసిపేట్ చేశారు. లాక్డౌన్ లేడీస్ పేరుతో ఈ వీడియోను నిహారిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్, నాగబాబు, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయితేజ్ సహా అందరూ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో వరుణ్‌తేజ్, సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగా, మెగాస్టార్ చిరంజీవి ఓ ఛానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ క్వారంటైన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
This time ladies taking up time to their most favorite thing #MakeupBrushChallenge ??@IamNiharikaK @sushkonidela#Allusneha #Sreeja #Megafamily #Lockdownladies #StayHomeStaySafe #QuarantineTime pic.twitter.com/5l0rmU9SBT
— Vamsi Shekar (@UrsVamsiShekar) April 23, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout