క్యూ కడుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోల ట్రెండ్ స్టార్ అయ్యి చాలా కాలమైంది. ఈ వరుసలో మెగా ఫ్యామిలీ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తూ మిగిలిన హీరోలకంటే చాలా ముందంజలో ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే మెగా ఫ్యామిలీ హీరోలు దసరాకి సందడి చేయబోతున్నారు. అక్టోబర్ 2న మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా కంచె' సినిమా రానుంది.

తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటించిన రుద్రమదేవి' అక్టోబర్ 9న విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న బ్రూస్ లీ' చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. మధ్యలో ఏ సమస్యలు వచ్చి సినిమాలు పోస్ట్ పోన్ కాకుంటే ఈ దసరాకి మెగా ఫ్యామిలీ హీరోలు సందడి చేయడంలో ఏ సందేహం లేదు.