నాని డైరెక్టర్‌తో మెగా హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మెగా హీరో వరుణ్ తేజ్. ఈ పొడుగు హీరో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేయబోయే సినిమాల గురించి పలు వార్తలు వినపడుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోయే సినిమాలో నటిస్తాడని వార్తలు వస్తుంటే, తాజాగా ఇప్పుడు..'నిన్ను కోరి' సినిమాను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని న్యూస్ వచ్చింది.
మరో వైపు వరుణ్ ఆ సినిమా చేయడం లేదని కూడా వార్తలు వచ్చాయి. `నిన్నుకోరి` సినిమాను నిర్మించిన డివివి దానయ్యనే ఈ సినిమాను కూడా నిర్మిస్తాడని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments