రెండు రోజుల ముందే ప్రారంభించ నున్న మెగాహీరో
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ శుక్రవారం (9వ తేదీన) మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్` మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుందామని ఆశపడ్డ సాయికి నిరాశే మిగిలింది. దీంతో.. ఇప్పుడు తన తదుపరి వెంచర్‌పై దృష్టి సారించారు ఈ మెగా హీరో. యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కరుణాకరన్ డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్ ఈ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
సాయి సరసన కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలను సమకూరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 14 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ముందుగా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. కాని ఇప్పుడు రెండు రోజుల ముందుగానే ప్రారంభించబోతున్నారని తెలిసింది. 'డార్లింగ్' స్వామి మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని...క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు. ఈ సినిమాతో అయినా సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments