మెగా హీరో హ్యాట్రిక్ కొడతాడా?

  • IndiaGlitz, [Monday,December 18 2017]

అల్లు అర‌వింద్ త‌న‌యుడు, అల్లు అర్జున్ త‌మ్ముడు అనే ట్యాగ్‌లైన్స్‌తో తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు యంగ్ హీరో అల్లు శిరీష్‌. తొలి చిత్రం గౌర‌వం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. రెండో చిత్రం కొత్త జంట‌తో తొలి హిట్‌ని సొంతం చేసుకున్నాడు శిరీష్‌. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం త‌రువాత‌.. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా చేశాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా యువ ద‌ర్శ‌కుడు ప‌రశురామ్ తెర‌కెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్నే న‌మోదు చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో రెండు విజ‌యాల త‌రువాత శిరీష్ నుంచి మూడో చిత్రం రానుంది. ఆ చిత్ర‌మే ఒక్క క్ష‌ణం. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సుర‌భి క‌థానాయిక‌గా న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఒక‌వేళ ఆ అంచ‌నాల‌ను గ‌నుక ఈ సినిమా అందుకుంటే.. శిరీష్ ఖాతాలో మ‌రో విజ‌యం ప‌డిన‌ట్లే. మ‌రి శిరీష్ హ్యాట్రిక్ కొడ‌తాడో లేదో తెలియాలంటే.. మ‌రో ప‌ది రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

More News

విజయవాడలో వైభవంగా 'జై సింహా' ఆడియో విడుదల వేడుక!!

నందమూరి బాలకృష్ణ,నయనతార,నటాషా జోషి,హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై సింహా'

మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా అఖిల్ 'హలో' గ్రాండ్ ఈవెంట్

యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో

29న 'అజ్ఞాత‌వాసి' సెన్సార్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అజ్ఞాత‌వాసి. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ర‌వితేజ హీరోయిన్ ఎవ‌రో..

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడిగా యువ ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కనున్న సంగ‌తి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

రామ్‌చ‌ర‌ణ్ విల‌న్ ద‌ర్శ‌కుడు కాబోతున్నాడు

అర‌వింద్ స్వామి.. పేరుకి త‌మిళ చిత్రాల క‌థానాయ‌కుడు అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఆయ‌న సుప‌రిచితుడే. రోజా, బొంబాయి త‌దిత‌ర అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన అర‌వింద్‌.. మౌనం అనే స్ట్ర‌యిట్ తెలుగు సినిమా కూడా చేశారు. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అర‌వింద్‌.. క‌డ‌లి సినిమాతో తిరిగి తెర‌పైకి వ‌చ్చారు.