శిక్షణ కోసం ఖజకిస్తాన్ వెళ్లనున్న మెగాహీరో
Send us your feedback to audioarticles@vaarta.com
'కంచె' వంటి భిన్నమైన చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. 'ఫిదా' మూవీతో అందరి మన్ననలను పొందారు ఈ యువ కథానాయకుడు. తాజాగా విడుదలైన 'తొలిప్రేమ'తో విమర్శకుల ప్రశంసల ను సైతం అందుకుంటున్నారు వరుణ్. ఇదిలా వుంటే...తన అప్ కమింగ్ మూవీని 'ఘాజీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేయనున్నారు ఈ యంగ్ హీరో.
ఈ భిన్నమైన కథను 'కంచె' నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మించనున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సహనిర్మాత, సమర్పకుడు కాగా...జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. త్వరలో ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలోగానీ లేదా మే నెలలోగానీ సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. మూవీలో ఎక్కువ భాగం జీరో గ్రావిటీతో చిత్రీకరించాల్సి ఉంది. అందుకోసం కృత్రిమ జీరో గ్రావిటీ వాతావరణంలో శిక్షణ కోసం వరుణ్ ఖజకిస్తాన్ వెళ్లనున్నట్టు నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే ఈ ఏడాది చివర్లో ఈ సైంటిఫిక్ ఫిలింను విడుదల చేయడానికి నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout