మెగా హీరో వెర్సస్ మెగా హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే రోజున లేదా ఒక రోజు గ్యాప్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు రిలీజవడం అతి తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇది జరుగుతుంటుంది. ఇలాంటి ఈ వ్యవహారమే.. ఈ ఏడాదిలో రెండు సార్లు జరగడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఒక రోజు గ్యాప్‌లో మెగాఫ్యామిలీకి చెందిన రెండు సినిమాలు ఇలాగే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ చిత్రాలే ఫిబ్రవరి 9న విడుదలైన సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్.. ఫిబ్రవరి 10న రిలీజైన వరుణ్ తేజ్ తొలిప్రేమ.
మళ్ళీ ఇదే ఫీట్ ఈ జూలై 6న రిపీట్ కానుంది. ఆ రోజు చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు రిలీజ్ కానుండగా.. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన తొలి చిత్రం విజేత కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మెగా హీరో వెర్సస్ మెగా హీరో అన్నట్లుగా ఉన్న ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం వీటిలో ఒక చిత్రం వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com