గాయం నుంచి కోలుకుని షూటింగ్ కు రెడీ అంటున్న మెగా హీరో..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో వరుణ్ తేజ్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నారు. 50 రోజులు రెస్ట్ తీసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఈరోజు నుంచి మిస్టర్ షూటింగ్ లో పాల్గొన్నారు.
ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...50 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈరోజు షూటింగ్ వెళుతుండడంతో చాలా ఎగ్జైట్ గా ఉన్నాను అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసాడు. వరుణ్ తేజ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా చిత్రాల్లో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com