గాయం నుంచి కోలుకుని షూటింగ్ కు రెడీ అంటున్న మెగా హీరో..!

  • IndiaGlitz, [Monday,November 21 2016]

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ లో వ‌రుణ్ తేజ్ కాలికి గాయ‌మైన విష‌యం తెలిసిందే. దీంతో వ‌రుణ్ తేజ్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నారు. 50 రోజులు రెస్ట్ తీసుకున్న వ‌రుణ్ తేజ్ ఇప్పుడు ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఈరోజు నుంచి మిస్ట‌ర్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...50 రోజులు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత ఈరోజు షూటింగ్ వెళుతుండ‌డంతో చాలా ఎగ్జైట్ గా ఉన్నాను అంటూ సంతోషాన్ని వ్య‌క్తం చేసాడు. వ‌రుణ్ తేజ్, శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మిస్ట‌ర్, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఫిదా చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

More News

చ‌ర‌ణ్ ధృవ సెన్సార్ పూర్తి..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై  ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రంగంరేంజ్ లో విజయం సాధించే చిత్రం రంగం 2 - విజయ్ దేవరకొండ

‘రంగం’ ఫేమ్ జీవా కథానాయకుడిగా నటించిన ‘రంగం-2’ ఈ నెల 25న విడుదలవుతోంది. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.యన్.బాలాజీ (సూపర్గుడ్ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించారు.

రాయలసీమ వరకు పవన్ కు నా మద్దతు - సీనియర్ నటుడు నరేష్

కామెడీ చిత్రాల కథానాయకుడుగా...ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి...నేడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సీనియర్ నటుడు నరేష్. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో శ్రీప్రియ తెరకెక్కించిన విభిన్న కథా చిత్రం ఘటన.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల '2.0' ఫస్ట్ లుక్ లాంచ్

సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్లో సుభాష్ కరణ్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ '2.0'. 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను ఆదివారం ముంబాయిలోని యశ్రాజ్ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖĹ

డిసెంబర్ 1న విజయ్ ఆంటోని 'బేతాళుడు' విడుదల

విజయ్ ఆంటోని'కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్ ' చిత్రం తెలుగు నాట 'బేతాళుడు' గా డిసెంబర్ 1 పలకరించబోతోంది.