అనుపమ ప్రతిభకి ఫ్లాట్ అయిపోయిన మెగాహీరో
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో ‘తేజ్.. ఐ లవ్ యు’ రూపొందుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అనుపమ నటనకి, ఆమెలో ఉన్న ప్రతిభకి మెగాహీరో తేజు ఫ్లాట్ అయిపోయారంట.
అందుకే.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న తన తదుపరి చిత్రంలో కూడా అనుపమను హీరోయిన్గా తీసుకోమని తనే సూచించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘చిత్ర లహరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో గతంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’లో నటించింది ఈ కేరళ కుట్టి. ఈ విధంగా ‘చిత్రలహరి’ సినిమా ద్వారా ఆ హీరో, దర్శకుడితో రెండు సార్లు కలిసి పని చేసే అవకాశం దక్కించుకుంది ఈ భామ. అన్నట్టు.. దిల్ రాజు నిర్మాణంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా అనుపమ రెండోసారి హీరోయిన్గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout