రామేశ్వరంలో మెగా వారసుడు
- IndiaGlitz, [Friday,July 27 2018]
మెగా వారసుడు వరుణ్ తేజ్ ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నారు. సంకల్స్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఆయన ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నారు. అది కూడా అబ్దుల్ కలాం చదువుకున్న పాఠశాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో వరుణ్‌తేజ్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆ చిత్ర కథానాయిక అదితిరావు హైదరీ.
ఈ సినిమాకు టెంటేటివ్‌గా 'అంతరిక్షమ్' అనే టైటిల్‌ని పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో వరుణ్, అదితి వ్యోమగాములలాగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అంతరిక్షానికి రాకెట్‌ను పంపించడానికి కలామ్ చేసిన కృషి కూడా అందరికీ తెలిసిందే. అబ్దుల్ కలామ్ వర్ధంతి రోజు ప్రపంచమే ఆయన్ని స్మరించుకుంటున్న తరుణంలో అదితిరావు హైదరీ పెట్టిన పోస్ట్ పలువురిని ఆకట్టుకుంది. ఘాజీ తర్వాత సంకల్ప్ రెడ్డి చేస్తున్న చిత్రమిది.