మెగా కానుక సిద్ధమవుతోంది...

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ చిత్రమిది.

అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, నయనతార, అనుష్క, తమన్నాతదితరులు నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సందర్భంలో తెరకెక్కించిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి సంబంధించిన సినిమా కావడంతో స్వాతంత్ర్య దినోత్సవానికి సినిమా మేకింగ్ వీడియో విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు మధ్యాహ్నం సైరా మేకింగ్ వీడియో విడుదల కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.