ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్రేమ్..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయణ‌రావు, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ముఖ్య అతిధులుగా హాజ‌రు అవుతున్నారు. ఇదిలా ఉంటే...ఈ మెగా ఈవెంట్ కు మెగా హీరోలు రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్...ఇలా మెగా హీరోలు అంద‌రూ హాజ‌ర‌వుతున్నారు. అయితే...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ వేడుక‌కు వ‌స్తారా..? లేదా..? అనేది ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది. ఏది ఏమైనా...మెగా హీరోలు అంద‌రూ ఒకే ఫ్రేమ్ లోకి వ‌స్తే...ఫ్యాన్స్ కు ఫెస్టివ‌లే..!